Tuesday, August 29, 2017
Thursday, August 24, 2017
Arjun Reddy REVIEW & RATING Vijay Deverakonda Shalini Directed by Sandeep Vanga
నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగ
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగ
సంగీతం : రాధన్
Arjun Reddy REVIEW & RATING Vijay Deverakonda Shalini Directed by Sandeep Vanga
Arjun Reddy Full Telugu REVIEW Click below link
http://www.filmymagazine.com/arjun-reddy-review-rating/
Vivekam Review Ajith Siva Anirudh Vivek Oberoi Kajal Aggarwal
http://www.filmymagazine.com/vivekam-review/
Vivekam Review Ajith Siva Anirudh Vivek Oberoi Kajal Aggarwal
Tuesday, August 22, 2017
Megastar Chiranjeevi upcoming film Sye Raa Narasimha Reddy movie Motion Poster release Today SyeRaaNarasimhaReddy
Megastar Chiranjeevi upcoming film Sye Raa Narasimha Reddy movie Motion Poster release
http://www.filmymagazine.com/megastar-chiranjeevi-film-sye-raa-narasimha-reddy-poster-release/
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఇప్పుడు ''సైరా నరసింహారెడ్డి'' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' చిత్రబృందంతో చిరు బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ 151 సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి మోషన్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి ఆవిష్కరించారు. ముందుగా అనుకొన్నట్టుగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' టైటిల్ లో ఉయ్యాలవాడకి బదులుగా సైరా పెట్టారు.
ఈ సినిమాలో నటీనటులు ఎవరెవ్వరు ఉండబోతున్నారు అనే సందేహం ఎప్పటినుండో ఉంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారో చెప్పేశారు
మన హీరో జగపతి బాబు, ఈగ సినిమాతో అలరించిన కన్నడ హీరో సుదీప్, అందాల హీరోయిన్ నయనతారతో పాటు, ప్రస్తుతం తమిళ సినిమాను హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఉన్నారు.
ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ లాంటి పేరు పొందిన టెక్నీషియన్లని ప్రాజెక్టులోకి తీసుకున్నారు.
ఉయ్యాలవాడకి బదులుగా సైరా పెట్టారు. సైరా నర్సింహారెడ్డి ఈ టైటిల్ అయితే తమిళం, మలయాళం, హిందీలో కూడా బాగుంటుందని చిరంజీవి తదితరులు డిసైడయ్యారు
Monday, August 21, 2017
Hello is Akhil Akkineni New film Title and Hello first look Poster
Hello is Akhil Akkineni New film Title and Hello first look Poster
http://www.filmymagazine.com/wp-content/uploads/2017/08/pro3-1.jpg
Sunday, August 20, 2017
Akhil Akkineni searching for new Title
Akhil Akkineni is one young hero, who is itching to prove himself at the box office. His father Akkineni Nagarjuna took all the responsibility to re-launch his son successfully after the debacle of his debut film, Akhil directed by VV Vinayak and produced by Nithiin. Now, the makers have started a guessing game to announce the title of the movie and tweeted few riddles to crack the title.
Movie Review: Anando Brahma
Movie Review: Anando Brahma
Rating: 2.75/5
Cast: Tapsee, Srinivas Reddy, Vennela Kishore, Shakalaka Shankar, Thagubothu Ramesh, Rajiv Kanakala, Raja Ravindra, Vijay Chander, Supreeth, Tanikella Bharani and Others.
Music: Krishna Kumar
Cinematography: Aneesh Tarun Kumar
Producers: Vijay Chilla-Sasi Devireddy
Story, Screenplay & Direction: Mahi K Raghav
Release Date: 18th of August 2017
Director Mahi K Raghav established himself as good story teller with this movie. He choose a novel concept and his narration style is laudable. He extracted the best output from Cast & Crew. On the flip side, He took a lot of inspiration from old movies for many sequences and the tempo keeps fluctuating.
The film is made on a very small budget but looks pretty neat. The camera work and visual effects are decent. Dialogues are hilarious and have been written with a lot of wits. The screenplay is the biggest plus as the film is narrated with simple and one point agenda which is fun. Background score is decent and does not make the film loud.
Tuesday, August 15, 2017
ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్ - రాజా ది గ్రేట్ - Raja The Great Teaser - Ravi Teja, Mehreen Pirzada Dil Raju, Anil Ravipudi
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈచిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు
రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుని పాత్రలో కనిపించబోతున్నాడు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.... ఆ నయనాల్లేకుండానే పాతికేళ్ల నుండి కుమ్మేత్తున్నాం ఇక్కడ... మిగతా పార్ట్స్ అమ్మేసుకుంటారా? సర్వేంద్రియానం సర్వం ప్రధానం' అంటూ రవితజ చెప్పే డైలాగుతో టీజర్ ప్రారంభమైంది.
ఇలాంటి కాన్సెప్ట్ తో అంటే హీరో గుడ్డివాడు గా కనపడినా కూడా ఒక కమర్షియల్ సినిమా తీసి హిట్టు కొట్టచ్చు అని ప్రూవ్ చెయ్యడం కోసం పరితపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావి పూడి.
`ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్` అనే సింగిల్ లైన్‌తో.. రవితేజ క్యారెక్టరైజేషన్ అర్థమైపోయింది. ఈ మెయిన్ పాయింట్ చుట్టూ కమర్షియల్ హంగులు అన్నీ జోడించి సినిమా రాసినట్టు ఉన్నాడు అనిల్. మేహరీన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. రాధిక రవితేజ తల్లి పాత్ర చేసింది.
తాప్సి కోరిక మేరకే 'ఆనందో బ్రహ్మ' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ‘సాహో ప్రభాస్ - Prabhas at AnandoBrahma Pre-Release Event
తాప్సి లీడ్ రోల్ లో నటిస్తున్న 'ఆనందో బ్రహ్మ' ఈనెల 18న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హీరో ప్రభాస్ గెస్ట్ గా వచ్చి యూనిట్ కి సపోర్ట్ గ నిలిచాడు. 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో తనతో కలిసి చేసిన తాప్సి కోరిక మేరకే ప్రభాస్ ఈ ఫంక్షన్ కు వచ్చినట్లు చెబుతున్నారు.
ఏదైతేనేం.. నిర్మాత విజయ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తాప్సి ఒక అందమైన దయ్యంలా కనిపిస్తుండడం ఈ సినిమాకు పెద్ద కమర్షియల్ వ్యాల్యూ అని చెప్పుకొచ్చారు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి మరో ముఖ్యపాత్ర చేస్తున్న ఈ మూవీ కథానేపథ్యం 'మనుషులు దెయ్యాన్ని భయపెట్టడం.
‘సాహో’ లుక్
పక్కాగా ‘సాహో’ లుక్ ఇదీ అన్న ఐడియా జనాలకు లేకపోయింది. ఐతే ‘సాహో’ షూటింగ్ మొదలయ్యే ముందు చివరగా ప్రభాస్ ‘ఆనందో బ్రహ్మ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. మేకప్ తో కొన్ని టచప్స్ ఉంటే ఉండొచ్చు కానీ.. ఇక్కడ ఎలా కనిపించాడో దానికి దగ్గరగానే ‘సాహో’లో ఉంటాడని భావిస్తున్నారు. ఈ చిత్రం 2018 వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.'డెడ్‌పూల్ 2' చిత్రీకరణలో విషాదం - Female stunt performer for the movie 'Deadpool 2' killed on set
'ఈ రోజు ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మా చిత్ర బృందంలో ఒకరిని కోల్పోయాం. ఇది చూసిన మా గుండె పగిలింది. దిగ్భ్రాంతికి గురయ్యాం. అయితే మృతురాలి కుటుంబ శోకాన్ని, వారు భరించలేని బాధను ఏదీ భర్తీ చేయలేదు - నటుడు ర్యాన్ రేనాల్డ్స్ ట్విటర్లో విచారం వ్యక్తం చేస్తూ సంతాప సందేశాన్ని పెట్టారు
'డెడ్‌పూల్ 2' చిత్రీకరణలో విషాదం చోటుచేసుకుంది. డౌన్‌టౌన్ వాంకోవర్‌లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా మోటార్‌సైకిల్ స్టంట్ డ్రైవర్ ప్రమాదానికి గురై మృతి చెందారు. షా టవర్ కార్యాలయ భవంతి వద్ద చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన మహిళా స్టంట్ డ్రైవర్ అదుపుతప్పి ప్రమాదానికి గురై చనిపోయింది.
Monday, August 14, 2017
రివ్యూ - జయ జానకీ నాయకా Jaya Janaki Nayaka Review, Jaya Janaki Naayaka. Movie Boyapati Srinu,bellamkonda sririnivas, rakulpreeth,
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ ప్రీత్ - జగపతిబాబు - శరత్ కుమార్ - తరుణ్ అరోరా - ప్రగ్యా జైశ్వాల్ - వాణీ విశ్వనాథ్ - సితార - నందు - శ్రవణ్ - జయప్రకాష్ - ధన్య బాలకృష్ణన్ - శివన్నారాయణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బోయపాటి శ్రీను
రేటింగ్ : 3/5
భద్ర, తులసి, దమ్ము, లెజెండ్, సరైనోడు.... ఒక్కో సినిమా ఒక్కో బ్యాంగ్. పవర్ ప్యాక్డ్ బ్లాస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ, పక్కా మాస్ మసాలా... జోనర్ ఏదైనా కావచ్చు సినిమా వచ్చిందంటే బీ, సీ సెంటర్లు దద్దరిల్లి పోతాయ్. అరుపులూ కేకలతో థియేటర్లు హోరెత్తుతాయ్. మామూలుగా హీరో కోసం చూసే అభిమానులు కూడా బోయపాటి తమ హీరోని సెలక్ట్ చేసుకున్నాడు అనగానే ఆ తరహా ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తారు.
కథ:
గగన్ (సాయిశ్రీనివాస్) ఒక పెద్ద ఇండస్టియలిస్ట్ కొడుకు. కానీ ఇంట్లో ఆడవాళ్లెవ్వరూ లేకపోవడం వల్ల గగన్ తో పాటు అతడి తండ్రి.. అన్నయ్య కొంచెం కఠువుగా.. దారి తప్పి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో గగన్ చదివే కాలేజీలో అతణ్ని చూసి ఇంప్రెస్ అయిన స్వీటీ (రకుల్ ప్రీత్).. గగన్ ఇంటికీ వచ్చి ఆ కుటుంబం మొత్తాన్ని మారుస్తుంది. దీంతో గగన్ తో పాటు అతడి కుటుంబం కూడా ఆమెకు ఫిదా అయిపోతుంది. స్వీటీ కూడా గగన్ ను ప్రేమిస్తుంది. కానీ వీళ్ల ప్రేమకు స్వీటీ తండ్రి అడ్డం పడతాడు. విధి లేని పరిస్థితుల్లో తన ప్రేమను గగన్ త్యాగం చేస్తాడు. కానీ తర్వాత స్వీటీ చాలా పెద్ద కష్టాల్లో ఉందని.. ఆమె జీవితానికి ప్రమాదమని తెలుస్తుంది గగన్ కు. ఇంతకీ గగన్ కు దూరమయ్యాక స్వీటీకి ఏమైంది.. ఈ జీవితానికి వచ్చిన ముప్పు ఏంటి.. గగన్ ఆమెను ఎవరి నుంచి ఎలా కాపాడుకున్నాడు.. అన్నది మిగతా కథ.
సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీనివాస్ రకుల్ ల మధ్య సీన్స్ బాగా రక్తికట్టించాయి. హీరో ఫ్యామిలీ సీన్స్ కూడా మంచి పాజిటివ్ మూడ్ ఏర్పరుస్తాయి. అయితే ఇదే కథతో ఇదవరకే చాలా సినిమాలు చూశాం అన్న భావన ఆడియెన్స్ కు వస్తుంది. కథనం కూడా తన పరంగా మాస్ ఎలిమెంట్స్ తో కొత్తగా రాసుకున్నట్టు అనిపించినా బోయపాటి మార్క్ సినిమాలా తప్ప మిగతాది అంతా కొత్తగా ఏమి అనిపించదు.
సాంకేతికవర్గం:
బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. జయ జానకి నాయకా సినిమా విషయంలో కూడా అదే ప్రూవ్ చేశాడు. సినిమా మొత్తం బోయపాటి మార్క్ లోనే సాగుతుంది. అయితే రొటీన్ కథ అంటూ కాస్త టాక్ వస్తుంది. ఇక కెమెరామన్ పనితనం బాగుంది. దేవి మ్యూజిక్ సినిమాకు మేజర్ హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హంసలదీవి దగ్గర సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ లో కూడా కొత్తదనం చూపించాడు బోయపాటి.
రివ్యూ : లై Lie Movie Review hanu-raghavapudi Nithiin Arjun Megha Akash suspense action thriller.
నటీనటులు: నితిన్ - మేఘా ఆకాశ్ - అర్జున్ - శ్రీరామ్ - రవికిషన్ - నాజర్ - మధునందన్ - పూర్ణిమ - సురేష్ - రాజీవ్ కనకాల - పృథ్వీ - బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట - వెంకట్
రచన - దర్శకత్వం: హను రాఘవపూడి
రేటింగ్ : 3/5
కథ :
ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు.అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..
నటీనటులు:
నితిన్ ‘లై’లో సరికొత్తగా కనిపిస్తాడు. అతడి లుక్.. మేనరిజమ్స్.. నటన.. అన్నీ కూడా చాలా భిన్నంగా అనిపిస్తాయి. పాత్రకు తగ్గట్లుగా సటిల్ పెర్ఫామెన్స్ తో నితిన్ ఆకట్టుకున్నాడు. పాత్రను అర్థం చేసుకుని నటించడంలో.. హావభావాలు ఇవ్వడంలో.. యాటిట్యూడ్ చూపించడంలో నితిన్ పరిణతి కనిపిస్తుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అతను బాగానే ఒదిగిపోయాడు. నితిన్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకడనంలో సందేహం లేదు. హీరోయిన్ మేఘా ఆకాష్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె క్యూట్ అనిపిస్తుంది కానీ.. మరీ అందగత్తె ఏమీ కాదు. నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. సినిమాలో నటన పరంగా అగ్రతాంబూలం మాత్రం అర్జున్ కే ఇవ్వాలి. తన అనుభవాన్నంతా ఉపయోగించి.. పద్మనాభం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు అర్జున్. ఆయన నటన వల్ల ఆ పాత్ర మరింత ప్రత్యేకంగా తయారైంది. ఈ సినిమా చూశాక అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కొత్త పాత్రలు తీర్చిదిద్దుకునే అవకాశముంది. కథకు కీలకమైన పాత్రల్లో శ్రీరామ్.. నాజర్ కూడా బాగా నటించారు. మధునందన్ ను కామెడీ కోసం పెట్టుకున్నారు కానీ.. అతను ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయాడు.
సాంకేతికవర్గం:
నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. డైలాగ్స్, ఆర్ట్స్ డైరెక్షన్ బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా ఇంకో పది నిముషాల సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఇక నితిన్ స్టైలిష్ మేకోవర్ చాలా బాగా అనిపించింది.
ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే ప్లేట్ ను బాగానే రాసుకున్న అయన తెరకెక్కించిన విధానమే సరిగా లేదు. అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.
రివ్యూ - నేనే రాజు నేనే మంత్రి - NeneRajuNeneMantri Telugu Movie REVIEW and RATING Rana KajalAggarwal Teja
రివ్యూ - నేనే రాజు నేనే మంత్రి
నటీనటులు: రానా దగ్గుబాటి - కాజల్ అగర్వాల్ - కేథరిన్ థ్రెసా - నవదీప్ - అశుతోష్ రాణా - తనికెళ్ల భరణి - సత్యప్రకాష్ - అజయ్ - ప్రదీప్ రావత్ - శివాజీ రాజా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
మాటలు: లక్ష్మీభూపాల్
సమర్పణ: సురేష్ బాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి - భరత్ చౌదరి
కథ - కథనం - దర్శకత్వం: తేజ
రేటింగ్ : 2.75/5
కథ
జోగేంద్ర (రానా) న్యాయంగా వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక సాధారణ యువకుడు. జోగేంద్ర భార్య రాధ (కాజల్). జోగేంద్రకు తన భార్య అంటే చచ్చేంత ప్రేమ. లేక లేక రాధకు కడుపు పండుతుంది. అయితే గ్రామంలోని గుడి వద్ద దీపం వెలిగించే విషయంలో జరిగిన గొడవలో సర్పంచ్(ప్రదీప్ రాత్) భార్య వల్ల రాధ కింద పడి గర్భం పోగొట్టుకుంటుంది. రాధ కోసం సర్పంచిగా గెలిచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జోగేంద్ర హత్యలు, కబ్జాలు ఇలా రాజకీయంగా ఎదగడానికి ఎన్ని చేయాలో అన్ని చూస్తూ ఎంఎల్ఏ, మంత్రి పదువుల చేపట్టి చివరకు సొంత పార్టీ పెట్టి సీఎం కుర్చీ కోసం పోటీ పడే స్థాయికి వెళతాడు
తనకంటూ ఓ మంచి ఫ్యామిలీతో సంతోషంగా జీవితం గడుపుతున్న జోగేంద్రఅనుకోకుండా సర్పంచ్ తో జరిగిన గొడవ వల్ల తాను రాజకీయ నాయకుడిగా మారాలని ఆలోచన వస్తుంది1. అక్కడి నుండి తన ఎత్తుగడలు మొదలవుతాయి. మొదట సర్పంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలా ఏకంగా ముఖ్యమంత్రికి కూడా చుక్కలు చూపించేస్తాడు. అయితే ఈ క్రమంలో తనకు శత్రువులు పెరిగిపోతారు. జోగేంద్ర భార్య రాధా (కాజల్) ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తున్న జోగేంద్రకు ఒకానిక దశలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అసలు జోగేంద్ర ఎందుకు అలా మారుతాడు..? ఉరి తీసేంత తప్పు జోగేంద్ర ఏం చేశాడు..? ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాలి.
సాంకేతికవర్గం:
అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలం. తనలోని కొత్త కోణాన్ని చూపించాడు అనూప్. ఈ తరహా సీరియస్ సినిమాలకు కూడా తాను సరిపోయే ఔట్ పుట్ ఇవ్వగలనని రుజువు చేసుకున్నాడు. అనూప్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని బాగానే ఎలివేట్ చేసింది. అతడి పాటలు పర్వాలేదు. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. తన కెమెరా పనితనంతో సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో వెంకట్ విజయవంతమయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లక్ష్మీ భూపాల్ మాటలు బాగా పేలాయి. దర్శకుడు తేజ.. తన శైలికి భిన్నమైన సినిమా చేసి.. తనకు పట్టిన తుప్పు వదిలించేసుకున్నాడు కానీ.. దీన్ని అనుకున్నంత పకడ్బందీగా మాత్రం తీయలేదు. వర్తమాన రాజకీయాలపై ఆయనకున్న అవగాహన కనిపిస్తుంది కానీ.. వాటిని లోతుగా అధ్యయనం చేసి.. వాస్తవికంగా సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఇలాంటి సినిమాలు రియలిస్టిగ్గా ఉండాలని ఆశిస్తారు ఎవరైనా. కానీ తేజ మాత్రం తనకు కన్వీనియెంట్ గా కథాకథనాలు రాసుకున్నాడు. అక్కడే దెబ్బ కొట్టేసింది. కనీసం ఆ తరహాలోనే అయినా.. ఒకే టెంపోను మెయింటైన్ చేయడంలోనూ విజయవంతం కాలేదు తేజ. సీరియస్ పొలిటికల్ డ్రామాలు ఎంత పకడ్బందీగా ఉంటే తప్ప ప్రేక్షకులకు కనెక్టవ్వవు. ఆ బిగిని తేజ చూపించలేకపోయాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది భిన్నంగా.. మెరుగ్గా అనిపిస్తుందన్నది మాత్రం వాస్తవం.
Thursday, August 10, 2017
Naga, Chaitanya Samantha Wedding Card - చైతూ సమంత ల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆన్ లైన్లో తెగ హడావుడి చేస్తోంది.
జియో ఫిలిం ఫేర్ అవార్డులకు హాజరైన చైతూ అక్కడ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పాడు. చైతూ సమంత ల నిశ్చితార్ధం జనవరి లో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఎలా జరగబోతుందో..వీరి వెడ్డింగ్ కార్డు ఎలా ఉంటుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో వీళ్ల వివాహం జరగనుంది.
సమంత పెళ్లి బట్టలను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసిందే. అదేంటంటే సామ్ పెళ్లిరోజు కట్టుకోబోయే చీర చైతు అమ్మమ్మది అట, అంటే ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు భార్య రాజేశ్వరిది.
దక్షిణాది చలన చిత్రరంగంలో నాగ చైతన్య, సమంతల ప్రేమ, పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది సినీ ప్రియులు వీరి వివాహ మహోత్సవం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరి వివాహా ఆహ్వాన పత్రిక అంటూ ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆన్ లైన్లో తెగ హడావుడి చేస్తోంది.
ఆ పత్రికలో వివాహం అక్టోబర్ 7వ తేదీన గోవాలోని వాఘటోర్ బీచిలోని బీచ్ లోని డెబ్ల్యూ హోటల్ లో జరుగుతుందని, అంతకు ముందు అక్టోబర్ 6న ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా అక్కడే జరుగుతుందని ఉంది. మరి ఈ పత్రిక వాస్తవమైనదో కాదో తెలియాలంటే అక్కినేని కుటుంబం నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇరు ఫ్యామిలీ పెద్దలు. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో చైతన్య-శామ్ ల పెళ్లి జరగనుంది. క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఈ 2 రోజుల్లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు.
Monday, August 7, 2017
ramyakrishnan on jfw magazine cover stunning look - మ్యాగజైన్ కవర్ పై రమ్యకృష్ణ
రమ్యకృష్ణ ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్, అప్పట్లో రమ్యకృష్ణని కేవలం గ్లామర్ గానే కాదు ఆహ్వానం లాంటి సినిమాల్లో కూడా రమ్య అందానికి దాసోహం అన్నారు. బాహుబాలిలో శివగామి పాత్రతో భారతదేశ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోని లేటు వయస్సులో ఎందరో అభిమానులని కూడగట్టుకుంది రమ్యకృష్ణ.
రమ్యకృష్ణకి 46 యేళ్ల వయసు అంటే నమ్మడం కష్టమే. తాజాగా జేఎఫ్డబ్ల్యూ మ్యాగజైన్ ముఖచిత్రంపై రమ్య ఇచ్చిన పోజును చూశాకా తల్లి పాత్రలు చేస్తున్నా, నయా హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్‌గా కనిపిస్తోంది రమ్య. ఇటీవలే నాగార్జున సరసన ఒక హీరోయిన్గా నటించి. ఆ సినిమాలోని అరడజను మంది అమ్మాయిలకు పోటీని ఇచ్చిన రమ్య. సీనియర్ హీరోల సరసన చక్కగా అమరేలా ఉంది
Jai Lava Kusa Lava Kumar First Look Teaser LavaKumarFirstLook - జై లవకుశ లో 'లవ' కు సంబదించిన లుక్ చాలా కూల్
జూనియర్ తాజా చిత్రం లో జై లవకుశ లో మూడు పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెల్సిందే ఇప్పటికే జై రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ ఆకట్టుకోగా, జై లవ కుశ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా దసరా సందర్భంగా సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈరోజు రాఖి సందర్భాంగా చిత్ర యూనిట్ ‘ లవ ‘ కు సంబదించిన లుక్ ను రిలీజ్ చేసారు. జై లో ఘూబిరంగా కనిపించిన ఎన్టీఆర్ , లవ కుమార్ లో మాత్రం చాల కూల్ గా కనిపించి అమ్మాయిల మనసులను దోచేశాడు
ఎన్టీఆర్ కు జోడిగా రాశీఖన్నా, నివేదా థామస్ నటిస్తుండగా , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలున్నాయి. కేవలం యుఎస్ హక్కులను దాదాపు రూ. 10.5 కోట్లు పెట్టి దక్కించుకున్నారని తెలుస్తుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Sunday, August 6, 2017
BIGG BOSS Friendship Day Rana Special Sameer Elimination| Jr NTR - బిగ్ బాస్ తెలుగు లో ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ సమీర్
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో లో ఎలిమినేట్ ఎవరన్న విషయం తేలిపోయింది బిగ్ బాస్ తెలుగు లో ముడవ వారం ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ సమీర్
బిగ్ బాస్ రియాల్టీ షో లో ఫస్ట్ జ్యోతి ఎలిమినేట్ అయ్యారు
తొలివారంలో అంతగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మధుప్రియ రెండోవారంలో ఆ వాతావరణానికి కొంత అలవాటు పడినట్టు కనిపించింది. అయితే అంతలోనే ఎలిమినేషన్‌కు నామినేట్ కావడం బిగ్‌బాస్ నుంచి బయటకు రావడం కూడా జరిగిపోయాయి.
బిగ్‌బాస్ రియాలిటీ షోలో కార్యక్రమంలో భాగంగా బయట ప్రపంచం తెలియకుండా బతుకుతున్న సెలబ్రిటీలకు ఓ కొత్త ఆనందం దొరికింది. కలహాలు, కలతలతో గత 22 రోజులుగా సినీ ప్రముఖులు గడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన రానాను చూసి ఇంటి సభ్యులు తొలుత షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆనందంతో స్వాగతం పలికారు. ఇంతకు జోగేంద్ర రూపంలో బిగ్‌బాస్ ఇంటిలోకి రానా ఎందుకు వచ్చాడంటే
తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ‘బిగ్ బాస్’ ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకుని.. ఈ షోకు కూడా తనవంతు సాయం చేయబోతున్నాడు రానా
priyanka chopra Isn't It Romantic - హాలీవుడ్ (ఇస్ ఇంట్ ఇట్ రొమాంటిక్) సినిమాలో బిజీగా ఉన్నా ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా
తమిళన్ (2002) అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది. తదుపరి సంవత్సరం, అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది మరియు ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం లభించింది. 2004వ సంవత్సరంలోఅబ్బాస్- మస్తాన్ల దర్శకత్వంలో వచ్చినఐత్రాజ్ (2004) చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకొనేలా ప్రదర్శించిన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం అందుకున్న రెండవ మహిళ అయ్యింది, తరువాత చోప్రా ముజ్సే షాది కరోగి (2004) చిత్రం, ఇప్పటివరకు తన చిత్రాల్లో అత్యంత వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్న క్రిష్ చిత్రం (2006) మరియు డాన్ - ది చేస్ బిగిన్స్ ఎగైన్ (2006) లాంటి ఎన్నో వాణిజ్య విజయాలను పరిశ్రమకు అందించింది. 2008వ సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది, ఈ విధంగా మంచి నటిగా స్థిరపడింది
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలలొ బాగా బిజీగా ఉంది
2015 లొ క్వాంటికొ అనే ఒక టి.వి షొ లొ నటించింది. దీనికి ప్రియాంకచోప్రా కు మంచి పేరు వచ్చింది. ఈ షొ తరువాత తనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
ఆ తరువాత బేవాచ్ అనే సినిమాలో నటించింది ఇందులొ నెగిటీవ్ రోల్ లొ నటించింది ఈ పాత్రకు మంచిపేరు లబించింది. ప్రస్తుతం "ఇస్ ఇంట్ ఇట్ రొమాంటిక్" అనే సినిమాలొ నటిస్తుంది ఇందులో చాలా గ్లామర్ గా కనపడుతుంది
thiruttupayaley2-first-look-posterdirected-by-susiganeshan-actress-amalapaul - తిరుట్టుపయలే-2 తమిళ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచిన అమలాపాల్
VijayDevarakonda EXTRAORDINARY Speech Arjun Reddy Trailer Launch ArjunReddyTrailer - అర్జున్ రెడ్డి పక్కాహిట్- విజయ్ దేవరకొండ
http://www.filmymagazine.com/vijay-devarakonda-extraordinary-speech/
విజయ్ దేవరకొండ త్వరలో 'అర్జన్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలవుతోంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ద్వారా హీరో విజయ్‌లోని కొత్త కోణాన్ని దర్శకుడు సందీప్ వంగ ఆవిష్కరించినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించబతున్నాడు. కోపాన్ని నియంత్రించుకోలేని వ్యక్తిగా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్, కావాలంటే ఎవరైనా బెట్ కాసుకోండి. నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఇచేస్తా. బెట్టింగ్ లీగలేనా. నువ్వు చేస్తుంటావుగా." అంటూ మరో సభ్యుడ్ని అడగగా వేదికపై ఉన్న వారంతా నవ్వేసారు. ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన నాని నటిస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతోందని ఇక నుండి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాల ట్రైలర్లు మాత్రమే నాని విడుదల చేస్తాడన్న పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా ఎందుకు కొన్నారా? అని అనుకునేవాళ్ళకు ఆగష్టు 25వ తేదీన తెలుస్తుందని. 150 రూపాయలు టికెట్ కొనుక్కుని ఒకటి, రెండు, మూడు సార్లు చూసినపుడు తెలుస్తుందని విజయ్ దేవరకొండ అన్నారు
విజయ్ దేవర కొండ, షాలిని, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజకృష్ణన్, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్.ఎక్స్ః హరికృష్ణ, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కృష్ణ వడ్డేపల్లి, మ్యూజిక్ః రధన్, కెమెరాః రాజ్ తోట, ఎడిటింగ్ః శశాంక్, నిర్మాతః ప్రణయ్ వంగా, రచన, దర్శకత్వంః సందీప్‌రెడ్డి వంగా.
Rana Daggubati Enters In to Bigg Boss Telugu Show Jr Ntr Gives Suprise to Bigboss Contestent - బిగ్ బాస్ హౌస్ లో రానా
తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ‘బిగ్ బాస్’ ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకుని.. ఈ షోకు కూడా తనవంతు సాయం చేయబోతున్నాడు రానా
స్పెషల్ గెస్ట్ అనగానే దీక్షా పంత్ లాగా ఇంకొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వస్తున్నారేమో అనుకోకండి. ఈసారి రాబోయే గెస్ట్ పార్టిసిపెంట్ గా కాదు. గెస్ట్ అప్పీయరెన్స్ మాత్రమే. ఆ అతిథి రానా దగ్గుబాటి. ‘బిగ్ బాస్’ షోకు రాబోతున్న ఫస్ట్ బిగ్ సెలబ్రెటీ రానానే కావడం విశేషం.ఈ టెలికాస్ట్ ఆదివారం (ఆగస్టు 6) న ప్రసారం కాబోతుంది.
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో విజవంతంగా ప్రసారం అవుతుంది. ఇప్పటికే బుల్లితెర రియాల్టీ షో లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన షో గా సరికొత్త రికార్డు సృష్టించింది. వారం మొత్తం అటుఇటుగా ఉన్న కాని శని , ఆది వారాల్లో మాత్రం ఎన్టీఆర్ రాకతో షో ను బాగా చూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి నటుడు రానా వచ్చాడు.
http://www.filmymagazine.com/rana-daggubati-enters-in-to-bigg-boss-telugu-show/
Saturday, August 5, 2017
Income Tax Exemption Official Statement From NTR - ఎన్టీఆర్ సర్వీస్ ట్యాక్స్ పై వివరణ ఇచ్చాడు.
ఎన్టీఆర్ స్పందించాడు. 'నాన్నకు ప్రేమతో' మూవీకి యంగ్ టైగర్‌కి సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడాన్ని కాగ్
ఆక్షేపించిన విషయంపై వివరణ ఇచ్చాడు.
పొరుగుదేశంలో అందించిన సేవలకు ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ వర్తించదని చెప్పడంతో నిర్మాతల నుంచి టాక్స్ వసూలు చేయలేదన్నాడు.
గతేడాది ఈ విషయంపై లిఖితపూర్వంగా తమ ఆడిటర్ రిప్లై ఇచ్చినట్టు చెప్పాడు. ఈ విషయంలో సంబంధిత అధికారుల నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఒకవేళ చట్టపరంగా చెల్లించాల్సిన రుసుము ఏమైనావుంటే పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా వున్నానని చెప్పాడు.
విదేశాల్లో చేసిన సినిమాలను సేవల ఎగుమతుల కింద చూపుతూ హీరోలు సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్నారని కాగ్ ఆక్షేపించినట్టు వార్తలొచ్చాయి. ఇందులోభాగంగా 'నాన్నకు ప్రేమతో' మూవీలో నటించినందుకు ఎన్టీఆర్‌కి, లండన్‌కు చెందిన వైబ్రంట్ విజువల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో ఏడున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని, సేవల పేరిట చెప్పి ఎన్టీఆర్ రూ.1.10 కోట్ల సర్వీసు ట్యాక్స్ మినహాయింపునకు క్లెయిమ్ చేసినట్లు తేలింది.
Subscribe to:
Posts (Atom)