జియో ఫిలిం ఫేర్ అవార్డులకు హాజరైన చైతూ అక్కడ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పాడు. చైతూ సమంత ల నిశ్చితార్ధం జనవరి లో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఎలా జరగబోతుందో..వీరి వెడ్డింగ్ కార్డు ఎలా ఉంటుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో వీళ్ల వివాహం జరగనుంది.
సమంత పెళ్లి బట్టలను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసిందే. అదేంటంటే సామ్ పెళ్లిరోజు కట్టుకోబోయే చీర చైతు అమ్మమ్మది అట, అంటే ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు భార్య రాజేశ్వరిది.
దక్షిణాది చలన చిత్రరంగంలో నాగ చైతన్య, సమంతల ప్రేమ, పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది సినీ ప్రియులు వీరి వివాహ మహోత్సవం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరి వివాహా ఆహ్వాన పత్రిక అంటూ ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆన్ లైన్లో తెగ హడావుడి చేస్తోంది.
ఆ పత్రికలో వివాహం అక్టోబర్ 7వ తేదీన గోవాలోని వాఘటోర్ బీచిలోని బీచ్ లోని డెబ్ల్యూ హోటల్ లో జరుగుతుందని, అంతకు ముందు అక్టోబర్ 6న ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా అక్కడే జరుగుతుందని ఉంది. మరి ఈ పత్రిక వాస్తవమైనదో కాదో తెలియాలంటే అక్కినేని కుటుంబం నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇరు ఫ్యామిలీ పెద్దలు. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో చైతన్య-శామ్ ల పెళ్లి జరగనుంది. క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఈ 2 రోజుల్లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment