నటీనటులు: నితిన్ - మేఘా ఆకాశ్ - అర్జున్ - శ్రీరామ్ - రవికిషన్ - నాజర్ - మధునందన్ - పూర్ణిమ - సురేష్ - రాజీవ్ కనకాల - పృథ్వీ - బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట - వెంకట్
రచన - దర్శకత్వం: హను రాఘవపూడి
రేటింగ్ : 3/5
కథ :
ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు.అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..
నటీనటులు:
నితిన్ ‘లై’లో సరికొత్తగా కనిపిస్తాడు. అతడి లుక్.. మేనరిజమ్స్.. నటన.. అన్నీ కూడా చాలా భిన్నంగా అనిపిస్తాయి. పాత్రకు తగ్గట్లుగా సటిల్ పెర్ఫామెన్స్ తో నితిన్ ఆకట్టుకున్నాడు. పాత్రను అర్థం చేసుకుని నటించడంలో.. హావభావాలు ఇవ్వడంలో.. యాటిట్యూడ్ చూపించడంలో నితిన్ పరిణతి కనిపిస్తుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అతను బాగానే ఒదిగిపోయాడు. నితిన్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకడనంలో సందేహం లేదు. హీరోయిన్ మేఘా ఆకాష్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె క్యూట్ అనిపిస్తుంది కానీ.. మరీ అందగత్తె ఏమీ కాదు. నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. సినిమాలో నటన పరంగా అగ్రతాంబూలం మాత్రం అర్జున్ కే ఇవ్వాలి. తన అనుభవాన్నంతా ఉపయోగించి.. పద్మనాభం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు అర్జున్. ఆయన నటన వల్ల ఆ పాత్ర మరింత ప్రత్యేకంగా తయారైంది. ఈ సినిమా చూశాక అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కొత్త పాత్రలు తీర్చిదిద్దుకునే అవకాశముంది. కథకు కీలకమైన పాత్రల్లో శ్రీరామ్.. నాజర్ కూడా బాగా నటించారు. మధునందన్ ను కామెడీ కోసం పెట్టుకున్నారు కానీ.. అతను ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయాడు.
సాంకేతికవర్గం:
నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. డైలాగ్స్, ఆర్ట్స్ డైరెక్షన్ బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా ఇంకో పది నిముషాల సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఇక నితిన్ స్టైలిష్ మేకోవర్ చాలా బాగా అనిపించింది.
ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే ప్లేట్ ను బాగానే రాసుకున్న అయన తెరకెక్కించిన విధానమే సరిగా లేదు. అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.
No comments:
Post a Comment