రివ్యూ - నేనే రాజు నేనే మంత్రి
నటీనటులు: రానా దగ్గుబాటి - కాజల్ అగర్వాల్ - కేథరిన్ థ్రెసా - నవదీప్ - అశుతోష్ రాణా - తనికెళ్ల భరణి - సత్యప్రకాష్ - అజయ్ - ప్రదీప్ రావత్ - శివాజీ రాజా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
మాటలు: లక్ష్మీభూపాల్
సమర్పణ: సురేష్ బాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి - భరత్ చౌదరి
కథ - కథనం - దర్శకత్వం: తేజ
రేటింగ్ : 2.75/5
కథ
జోగేంద్ర (రానా) న్యాయంగా వడ్డీ వ్యాపారం చేసుకునే ఒక సాధారణ యువకుడు. జోగేంద్ర భార్య రాధ (కాజల్). జోగేంద్రకు తన భార్య అంటే చచ్చేంత ప్రేమ. లేక లేక రాధకు కడుపు పండుతుంది. అయితే గ్రామంలోని గుడి వద్ద దీపం వెలిగించే విషయంలో జరిగిన గొడవలో సర్పంచ్(ప్రదీప్ రాత్) భార్య వల్ల రాధ కింద పడి గర్భం పోగొట్టుకుంటుంది. రాధ కోసం సర్పంచిగా గెలిచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జోగేంద్ర హత్యలు, కబ్జాలు ఇలా రాజకీయంగా ఎదగడానికి ఎన్ని చేయాలో అన్ని చూస్తూ ఎంఎల్ఏ, మంత్రి పదువుల చేపట్టి చివరకు సొంత పార్టీ పెట్టి సీఎం కుర్చీ కోసం పోటీ పడే స్థాయికి వెళతాడు
తనకంటూ ఓ మంచి ఫ్యామిలీతో సంతోషంగా జీవితం గడుపుతున్న జోగేంద్రఅనుకోకుండా సర్పంచ్ తో జరిగిన గొడవ వల్ల తాను రాజకీయ నాయకుడిగా మారాలని ఆలోచన వస్తుంది1. అక్కడి నుండి తన ఎత్తుగడలు మొదలవుతాయి. మొదట సర్పంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలా ఏకంగా ముఖ్యమంత్రికి కూడా చుక్కలు చూపించేస్తాడు. అయితే ఈ క్రమంలో తనకు శత్రువులు పెరిగిపోతారు. జోగేంద్ర భార్య రాధా (కాజల్) ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తున్న జోగేంద్రకు ఒకానిక దశలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అసలు జోగేంద్ర ఎందుకు అలా మారుతాడు..? ఉరి తీసేంత తప్పు జోగేంద్ర ఏం చేశాడు..? ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాలి.
సాంకేతికవర్గం:
అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలం. తనలోని కొత్త కోణాన్ని చూపించాడు అనూప్. ఈ తరహా సీరియస్ సినిమాలకు కూడా తాను సరిపోయే ఔట్ పుట్ ఇవ్వగలనని రుజువు చేసుకున్నాడు. అనూప్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని బాగానే ఎలివేట్ చేసింది. అతడి పాటలు పర్వాలేదు. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. తన కెమెరా పనితనంతో సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో వెంకట్ విజయవంతమయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లక్ష్మీ భూపాల్ మాటలు బాగా పేలాయి. దర్శకుడు తేజ.. తన శైలికి భిన్నమైన సినిమా చేసి.. తనకు పట్టిన తుప్పు వదిలించేసుకున్నాడు కానీ.. దీన్ని అనుకున్నంత పకడ్బందీగా మాత్రం తీయలేదు. వర్తమాన రాజకీయాలపై ఆయనకున్న అవగాహన కనిపిస్తుంది కానీ.. వాటిని లోతుగా అధ్యయనం చేసి.. వాస్తవికంగా సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఇలాంటి సినిమాలు రియలిస్టిగ్గా ఉండాలని ఆశిస్తారు ఎవరైనా. కానీ తేజ మాత్రం తనకు కన్వీనియెంట్ గా కథాకథనాలు రాసుకున్నాడు. అక్కడే దెబ్బ కొట్టేసింది. కనీసం ఆ తరహాలోనే అయినా.. ఒకే టెంపోను మెయింటైన్ చేయడంలోనూ విజయవంతం కాలేదు తేజ. సీరియస్ పొలిటికల్ డ్రామాలు ఎంత పకడ్బందీగా ఉంటే తప్ప ప్రేక్షకులకు కనెక్టవ్వవు. ఆ బిగిని తేజ చూపించలేకపోయాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది భిన్నంగా.. మెరుగ్గా అనిపిస్తుందన్నది మాత్రం వాస్తవం.
No comments:
Post a Comment