నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ ప్రీత్ - జగపతిబాబు - శరత్ కుమార్ - తరుణ్ అరోరా - ప్రగ్యా జైశ్వాల్ - వాణీ విశ్వనాథ్ - సితార - నందు - శ్రవణ్ - జయప్రకాష్ - ధన్య బాలకృష్ణన్ - శివన్నారాయణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బోయపాటి శ్రీను
రేటింగ్ : 3/5
భద్ర, తులసి, దమ్ము, లెజెండ్, సరైనోడు.... ఒక్కో సినిమా ఒక్కో బ్యాంగ్. పవర్ ప్యాక్డ్ బ్లాస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ, పక్కా మాస్ మసాలా... జోనర్ ఏదైనా కావచ్చు సినిమా వచ్చిందంటే బీ, సీ సెంటర్లు దద్దరిల్లి పోతాయ్. అరుపులూ కేకలతో థియేటర్లు హోరెత్తుతాయ్. మామూలుగా హీరో కోసం చూసే అభిమానులు కూడా బోయపాటి తమ హీరోని సెలక్ట్ చేసుకున్నాడు అనగానే ఆ తరహా ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తారు.
కథ:
గగన్ (సాయిశ్రీనివాస్) ఒక పెద్ద ఇండస్టియలిస్ట్ కొడుకు. కానీ ఇంట్లో ఆడవాళ్లెవ్వరూ లేకపోవడం వల్ల గగన్ తో పాటు అతడి తండ్రి.. అన్నయ్య కొంచెం కఠువుగా.. దారి తప్పి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో గగన్ చదివే కాలేజీలో అతణ్ని చూసి ఇంప్రెస్ అయిన స్వీటీ (రకుల్ ప్రీత్).. గగన్ ఇంటికీ వచ్చి ఆ కుటుంబం మొత్తాన్ని మారుస్తుంది. దీంతో గగన్ తో పాటు అతడి కుటుంబం కూడా ఆమెకు ఫిదా అయిపోతుంది. స్వీటీ కూడా గగన్ ను ప్రేమిస్తుంది. కానీ వీళ్ల ప్రేమకు స్వీటీ తండ్రి అడ్డం పడతాడు. విధి లేని పరిస్థితుల్లో తన ప్రేమను గగన్ త్యాగం చేస్తాడు. కానీ తర్వాత స్వీటీ చాలా పెద్ద కష్టాల్లో ఉందని.. ఆమె జీవితానికి ప్రమాదమని తెలుస్తుంది గగన్ కు. ఇంతకీ గగన్ కు దూరమయ్యాక స్వీటీకి ఏమైంది.. ఈ జీవితానికి వచ్చిన ముప్పు ఏంటి.. గగన్ ఆమెను ఎవరి నుంచి ఎలా కాపాడుకున్నాడు.. అన్నది మిగతా కథ.
సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీనివాస్ రకుల్ ల మధ్య సీన్స్ బాగా రక్తికట్టించాయి. హీరో ఫ్యామిలీ సీన్స్ కూడా మంచి పాజిటివ్ మూడ్ ఏర్పరుస్తాయి. అయితే ఇదే కథతో ఇదవరకే చాలా సినిమాలు చూశాం అన్న భావన ఆడియెన్స్ కు వస్తుంది. కథనం కూడా తన పరంగా మాస్ ఎలిమెంట్స్ తో కొత్తగా రాసుకున్నట్టు అనిపించినా బోయపాటి మార్క్ సినిమాలా తప్ప మిగతాది అంతా కొత్తగా ఏమి అనిపించదు.
సాంకేతికవర్గం:
బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. జయ జానకి నాయకా సినిమా విషయంలో కూడా అదే ప్రూవ్ చేశాడు. సినిమా మొత్తం బోయపాటి మార్క్ లోనే సాగుతుంది. అయితే రొటీన్ కథ అంటూ కాస్త టాక్ వస్తుంది. ఇక కెమెరామన్ పనితనం బాగుంది. దేవి మ్యూజిక్ సినిమాకు మేజర్ హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హంసలదీవి దగ్గర సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ లో కూడా కొత్తదనం చూపించాడు బోయపాటి.
No comments:
Post a Comment