రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈచిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు
రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుని పాత్రలో కనిపించబోతున్నాడు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.... ఆ నయనాల్లేకుండానే పాతికేళ్ల నుండి కుమ్మేత్తున్నాం ఇక్కడ... మిగతా పార్ట్స్ అమ్మేసుకుంటారా? సర్వేంద్రియానం సర్వం ప్రధానం' అంటూ రవితజ చెప్పే డైలాగుతో టీజర్ ప్రారంభమైంది.
ఇలాంటి కాన్సెప్ట్ తో అంటే హీరో గుడ్డివాడు గా కనపడినా కూడా ఒక కమర్షియల్ సినిమా తీసి హిట్టు కొట్టచ్చు అని ప్రూవ్ చెయ్యడం కోసం పరితపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావి పూడి.
`ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్` అనే సింగిల్ లైన్‌తో.. రవితేజ క్యారెక్టరైజేషన్ అర్థమైపోయింది. ఈ మెయిన్ పాయింట్ చుట్టూ కమర్షియల్ హంగులు అన్నీ జోడించి సినిమా రాసినట్టు ఉన్నాడు అనిల్. మేహరీన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. రాధిక రవితేజ తల్లి పాత్ర చేసింది.
No comments:
Post a Comment