Filmymagazine
Sunday, August 6, 2017
thiruttupayaley2-first-look-posterdirected-by-susiganeshan-actress-amalapaul - తిరుట్టుపయలే-2 తమిళ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచిన అమలాపాల్
'తిరుట్టుపయలే-2' తమిళ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అమలాపాల్ తన గత చిత్రాలను మించి గ్లామర్‌ను ఒలకబోసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 2006లో విడుదలైన 'తిరుట్టుపయలే' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి సుశి గణేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిభాగం విజయంలో సీనియర్ నటి మాళవిక గ్లామర్ కీలకపాత్ర వహించింది. అదే విధంగా సీక్వెల్‌లో అమలాపాల్ గ్లామర్‌తో మరింతగా ఆకట్టుకుంతుందని చెబుతున్నారు. గురువారం 'తిరుట్టుపయలే-2' ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో అమలాపాల్ స్టిల్స్ చూసిన వారందరూ ఆమె గ్లామర్‌ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో బాబిసింహా హీరోగా నటిస్తున్నారు. ప్రసన్న కీలకపాత్ర పోషిస్తున్నారు. అమలాపాల్ కథానాయిక. సుశీ గణేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 24వ తేదీన చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు దాన్ని 5 లక్షల మంది చూశారు. ఫస్ట్‌లుక్‌ను నటుడు విజయ్ సేతుపతి ఇటీవల విడుదల చేశారు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment