Sunday, August 6, 2017

VijayDevarakonda EXTRAORDINARY Speech Arjun Reddy Trailer Launch ArjunReddyTrailer - అర్జున్ రెడ్డి పక్కాహిట్- విజయ్ దేవరకొండ


http://www.filmymagazine.com/vijay-devarakonda-extraordinary-speech/

విజయ్ దేవరకొండ త్వరలో 'అర్జన్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలవుతోంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్ ద్వారా హీరో విజ‌య్‌లోని కొత్త కోణాన్ని ద‌ర్శ‌కుడు సందీప్ వంగ ఆవిష్క‌రించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించబతున్నాడు. కోపాన్ని నియంత్రించుకోలేని వ్యక్తిగా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్, కావాలంటే ఎవరైనా బెట్ కాసుకోండి. నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఇచేస్తా. బెట్టింగ్ లీగలేనా. నువ్వు చేస్తుంటావుగా." అంటూ మరో సభ్యుడ్ని అడగగా వేదికపై ఉన్న వారంతా నవ్వేసారు. ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన నాని నటిస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతోందని ఇక నుండి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాల ట్రైలర్లు మాత్రమే నాని విడుదల చేస్తాడన్న పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా ఎందుకు కొన్నారా? అని అనుకునేవాళ్ళకు ఆగష్టు 25వ తేదీన తెలుస్తుందని. 150 రూపాయలు టికెట్ కొనుక్కుని ఒకటి, రెండు, మూడు సార్లు చూసినపుడు తెలుస్తుందని విజయ్ దేవరకొండ అన్నారు
విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.

No comments:

Post a Comment