ప్రియాంక చోప్రా
తమిళన్ (2002) అనే తమిళ చలన చిత్రం ద్వారా నటన జీవితం ప్రారంభించింది. తదుపరి సంవత్సరం, అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై (2003) ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది మరియు ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం లభించింది. 2004వ సంవత్సరంలోఅబ్బాస్- మస్తాన్‌ల దర్శకత్వంలో వచ్చినఐత్రాజ్ (2004) చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకొనేలా ప్రదర్శించిన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం అందుకున్న రెండవ మహిళ అయ్యింది, తరువాత చోప్రా ముజ్సే షాది కరోగి (2004) చిత్రం, ఇప్పటివరకు తన చిత్రాల్లో అత్యంత వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్న క్రిష్ చిత్రం (2006) మరియు డాన్ - ది చేస్ బిగిన్స్ ఎగైన్ (2006) లాంటి ఎన్నో వాణిజ్య విజయాలను పరిశ్రమకు అందించింది. 2008వ సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది, ఈ విధంగా మంచి నటిగా స్థిరపడింది
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలలొ బాగా బిజీగా ఉంది
2015 లొ క్వాంటికొ అనే ఒక టి.వి షొ లొ నటించింది. దీనికి ప్రియాంకచోప్రా కు మంచి పేరు వచ్చింది. ఈ షొ తరువాత తనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
ఆ తరువాత బేవాచ్ అనే సినిమాలో నటించింది ఇందులొ నెగిటీవ్ రోల్ లొ నటించింది ఈ పాత్రకు మంచిపేరు లబించింది. ప్రస్తుతం "ఇస్ ఇంట్ ఇట్ రొమాంటిక్" అనే సినిమాలొ నటిస్తుంది ఇందులో చాలా గ్లామర్ గా కనపడుతుంది
No comments:
Post a Comment