Tuesday, August 22, 2017

Megastar Chiranjeevi upcoming film Sye Raa Narasimha Reddy movie Motion Poster release Today SyeRaaNarasimhaReddy






Megastar Chiranjeevi upcoming film Sye Raa Narasimha Reddy movie Motion Poster release

http://www.filmymagazine.com/megastar-chiranjeevi-film-sye-raa-narasimha-reddy-poster-release/


మెగాస్టార్ చిరంజీవి హీరోగా  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఇప్పుడు ''సైరా నరసింహారెడ్డి'' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.




'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' చిత్రబృందంతో చిరు బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ 151 సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి మోషన్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి ఆవిష్కరించారు. ముందుగా అనుకొన్నట్టుగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' టైటిల్ లో ఉయ్యాలవాడకి బదులుగా సైరా పెట్టారు.



ఈ సినిమాలో నటీనటులు ఎవరెవ్వరు ఉండబోతున్నారు అనే సందేహం ఎప్పటినుండో ఉంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారో చెప్పేశారు

మన హీరో జగపతి బాబు, ఈగ సినిమాతో అలరించిన కన్నడ హీరో సుదీప్, అందాల హీరోయిన్ నయనతారతో పాటు, ప్రస్తుతం తమిళ సినిమాను హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఉన్నారు.




ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ లాంటి పేరు పొందిన టెక్నీషియన్లని ప్రాజెక్టులోకి తీసుకున్నారు.




ఉయ్యాలవాడకి బదులుగా సైరా పెట్టారు. సైరా నర్సింహారెడ్డి ఈ టైటిల్‌ అయితే తమిళం, మలయాళం, హిందీలో కూడా బాగుంటుందని చిరంజీవి తదితరులు డిసైడయ్యారు

No comments:

Post a Comment