Saturday, August 5, 2017

Income Tax Exemption Official Statement From NTR - ఎన్టీఆర్ సర్వీస్ ట్యాక్స్ పై వివరణ ఇచ్చాడు.




ఎన్టీఆర్ స్పందించాడు. 'నాన్నకు ప్రేమతో' మూవీకి యంగ్ టైగర్‌కి సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడాన్ని కాగ్
ఆక్షేపించిన విషయంపై వివరణ ఇచ్చాడు.
పొరుగుదేశంలో అందించిన సేవలకు ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ వర్తించదని చెప్పడంతో నిర్మాతల నుంచి టాక్స్ వసూలు చేయలేదన్నాడు.
గతేడాది ఈ విషయంపై లిఖితపూర్వంగా తమ ఆడిటర్ రిప్లై ఇచ్చినట్టు చెప్పాడు. ఈ విషయంలో సంబంధిత అధికారుల నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఒకవేళ చట్టపరంగా చెల్లించాల్సిన రుసుము ఏమైనావుంటే పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా వున్నానని చెప్పాడు.
విదేశాల్లో చేసిన సినిమాలను సేవల ఎగుమతుల కింద చూపుతూ హీరోలు సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేస్తున్నారని కాగ్‌ ఆక్షేపించినట్టు వార్తలొచ్చాయి. ఇందులోభాగంగా 'నాన్నకు ప్రేమతో' మూవీలో నటించినందుకు ఎన్టీఆర్‌కి, లండన్‌కు చెందిన వైబ్రంట్ విజువల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో ఏడున్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని, సేవల పేరిట చెప్పి ఎన్టీఆర్ రూ.1.10 కోట్ల సర్వీసు ట్యాక్స్‌ మినహాయింపునకు క్లెయిమ్‌ చేసినట్లు తేలింది.

No comments:

Post a Comment